Home » Kaushik Reddy
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు అయింది. గురువారం కౌశిక్‌రెడ్డి పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. రాత్రి ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు ముందు, తర్వాత హైడ్రామా నెలకొంది. కౌశిక్ రెడ్డి అరెస్టును అడ్డుకొనేందుకు కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలను వచ్చినవారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు.
కొద్దినెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి తన మొబైల్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్రెడ్డి ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. దళిత బంధు రెండో విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని శనివారం దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ తన ఎదుట ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా చూస్తూ ఊరికే ఉంటానంటే కుదరదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టుకు తెలిపారు.
డ్రగ్స్‌కు సంబంధించి కాంగ్రె్స-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు తెరతీశారని.. తనను డ్రగ్స్‌కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన సీఎం రేవంత్‌రెడ్డితోనే
తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రీల్స్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తనను హత్య చేయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పంపించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.