TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

ABN , First Publish Date - 2023-04-11T08:44:08+05:30 IST

TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్,

TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

హైదరాబాద్: TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖల చేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్‏ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారని అభియోగలపై ఈ డి విచారణ ప్రారంభించింది. కాగా.. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. కాగా ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. అలాగే సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ఈడి ప్రధాన దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్ గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అనుమానిస్తున్నారు. శంకర్ లక్ష్మి తో పాటు టీఎస్‏పీఎస్‏సీ కి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో ఈడి పేర్కొంది.

Updated Date - 2023-04-11T08:44:08+05:30 IST