Singareni Employees: కేసీఆర్ సర్కార్‌పై సింగరేణి కార్మికుల ఆగ్రహం
ABN , First Publish Date - 2023-10-18T10:59:19+05:30 IST
కేసీఆర్ సర్కార్ తీరుపై సింగరేణి కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో లాభాల్లో బోనస్ చెల్లింపు నిలుపుదలపై కార్మికులు ఆందోళన బాట పట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం: కేసీఆర్ సర్కార్ (KCR Government) తీరుపై సింగరేణి కార్మికులు(Singareni Employees) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో లాభాల్లో బోనస్ చెల్లింపు నిలుపుదలపై కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఎన్నికల కోడ్ లెటర్‌ను బహిర్గతం చేయాలని బీఎంఎస్ (BMS) డిమాండ్ చేస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌లో బొగ్గు గని కార్మికులకు లేని నిబంధనలు సింగరేణిలో ఎందుకు అని బీఎంఎస్ జాతీయ కార్యదర్శి మాధవ్ నాయక్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ పెద్దల డైరక్షన్‌లో సింగరేణి యాజమాన్యం పనిచేస్తోందని విరుచుకుపడ్డారు. సింగరేణి ఆర్థిక సంక్షోభంలో ఉందనడానికి లాభాల్లో వాటా బోనస్ చెల్లించకపోవడమే నిదర్శనమన్నారు. సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం రూ.24 వేల 761 కోట్లు బకాయిపడిందని చెప్పుకొచ్చారు. సింగరేణిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి కార్మికుల కుటుంబాల్లో కేసీఆర్ సర్కార్ అశాంతి రేపిందని మండిపడ్డారు. రాజకీయ జిమ్మిక్కులు లేకుండా లాభాల్లో వాటా బోనస్ వెంటనే చెల్లించాలని బీఎంఎస్ జాతీయ కార్యదర్శి మాధవ్ నాయక్ డిమాండ్ చేశారు.