TS News: అధిక కౌలు వసూలుపై ఖబడ్దార్.. మావోల లేఖ
ABN , First Publish Date - 2023-03-25T17:44:07+05:30 IST
జిల్లాలోని చర్ల (Charla) శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది.
భద్రాద్రి: జిల్లాలోని చర్ల (Charla) శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది. గ్రామాల్లో మళ్లీ పెత్తందారీ వ్యవస్థ పుంజుకుందని మావోయిస్టులు (Mavoist) లేఖ రాశారు. రైతులను సాగుకు దూరం చేస్తే చర్యలు తప్పవని లేఖ ద్వారా సూచించారు. ఎకరానికి రూ.లక్ష కౌలు తీసుకునే వలస వాదులారా ఖబడ్దార్.. అధిక కౌలు వసూలు చేస్తే శిక్ష తప్పదని లేఖద్వారా హెచ్చరిక జారీ చేశారు. ఈ లేఖతో రైతులు ఆందోళన చెందుతున్నారు.