Revanth: సీఎం పర్యటనలో.. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం ఏంటి?..

ABN , First Publish Date - 2023-01-12T12:18:19+05:30 IST

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief), ఎంపీ రేవంత్ రెడ్డి (MP Revanthreddy) పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Revanth: సీఎం పర్యటనలో.. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం ఏంటి?..

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief), ఎంపీ రేవంత్ రెడ్డి (MP Revanthreddy) పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ నాయకులను (Congress Leaders) ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని, ఇది నియంత పాలనకు పరాకాష్ట అని అన్నారు. సీఎం కేసీఆర్ పర్యటనకు వస్తుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులను అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేయడం... పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఏంటి?.. ఇదేమైనా రాజరికమా? అని ప్రశ్నించారు. అరెస్టులు చేసిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే భే శరతుగా విడుదల చేయాలని, విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

కాగా గురువారం కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, ఆదివాసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలను ఆదివాసి అభ్యుదయ సంఘం నాయకులు ఖండించారు. కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-01-12T12:18:25+05:30 IST