KMM: నారా భువనేశ్వరిని కలిసిన టీడీపీ ఖమ్మం జిల్లా నేతలు
ABN , First Publish Date - 2023-10-13T12:48:54+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమంగా అరెస్ట్ చేయడం హేయనీయమని
ఖమ్మం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమంగా అరెస్ట్ చేయడం హేయనీయమని ఆ పార్టీ జిల్లా నాయకులు కేతినేని హరీష్ అన్నారు. గురువారం రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కేతినేని హరీష్(Ketineni Harish) ఆధ్వర్యంలో టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు కలిశారు. జిల్లాలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత నిరసన కార్యక్రమాలను భువనేశ్వరికి వివరించారు. చంద్రబాబు నాయుడుకు జిల్లా అండగా నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) మహిళా నాయకులకు, కార్యకర్తలకు కేతినేని హరీష్‌ను అభినందించారు. ఆమెను కలిసిన వారిలో మందపల్లి రజని, చుండూరి రాజరాజేశ్వరి, కామా అనిత, పాల్వంచ రామారావు, చింతనిప్పు నాగేశ్వరరావు, రామారావు, కన్నేటి పృథ్వి తదితరులు ఉన్నారు.