Home » Khammam News
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన దంపతులను వారింట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తులే చంపేశారు. దంపతులు డబ్బున్నవారని తెలిసి..
సహజంగా ప్రేమికులు పార్కుల చుట్టూ తిరగడం కామన్. దాదాపుగా ఏ పార్కులో చూసినా ప్రేమ జంటలు కనిపిస్తునే ఉంటాయి. కానీ ఖమ్మంలోని ఓ పార్కులో ప్రేమికులకు అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ప్రేమికులకు ప్రవేశం లేదు.
ఖమ్మం జిల్లాలో సీతారామ భక్తరామ దాసు ప్రాజెక్ట్లతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్మ వారు అమెరికాలో రాణిస్తున్నారని తెలిపారు. తోటి కులాలను గౌరవిస్తూ లౌకిక భావనతో కమ్మ కులం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ కొలువులు పొందిన ఏడుగురు హిందీ పండిట్ల ఆశలు ఉద్యోగంలో చేరిన 20 రోజుల్లోనే అడియాశలయ్యాయి.
బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అరెస్టు ఘటన గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల తీరు హైడ్రామాను తలపించగా, బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఆందోళనలకు దిగాయి. చింతకాని మండలంలోని పొద్దుటూరుతో పాటు మధిర, వైరాల్లో పోలీసుల చర్య కలకలం రేపింది. కారులో మఫ్టీలో వచ్చిన నలుగురు ఎస్ఐలు, ఒక సీఐ... అయ్యప్ప మాలలో ఉన్న పుల్లయ్యను బలవంతంగా తీసుకెళ్తుండగా, ఆయన భార్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
‘మీలో ప్రతీ ఒక్కరి పనితీరు నాకు తెలుసు.. నా నుంచి మీరు తప్పించుకోలేరు.. కచ్చితంగా పని చేయాల్సిందే.. మున్నేరు వరదలకు కారణం మీరే.. మీ వేతనాలకు కోత వేయించాల్సింది. కానీ చేయలేదు. మీ జాబ్ చార్టు మేరకు పనిచేయండి, పని చేయలేకుంటే సెలవ్పై వెళ్లండి..’ అంటూ కలెక్టర్ ముజమ్మిల్ఖాన్(Collector Muzammil Khan) ఖమ్మం నగర పాలక సంస్థ విభాగాల అధికారులను హెచ్చరించారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మద్యం టెండర్లు(Liquor tenders) జరిగితే సరిహద్దు జిల్లాలోని మద్యం వ్యాపారులు పాల్గొంటారు. గతేడాది తెలంగాణలో జరిగిన మద్యం టెండరు ప్రక్రియలో ఏపీకి చెందిన మద్యం వ్యాపారులు జోరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మద్యం టెండర్లలో పాల్గొన్నారు. అ
ఖమ్మంలో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయడంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, నష్టం అంచనాలపై ఈరోజు( మంగళవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.