BRS : బీఆర్ఎస్‌లోకి జోరుగా చేరికలు.. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేత గులాబీ కండువా కప్పుకోవడంతో..
ABN , First Publish Date - 2023-04-02T20:39:11+05:30 IST
బీఆర్ఎస్‌లోకి(Bharat Rastra Samithi) మహారాష్ట్ర (Maharashtra) నుంచి చేరికలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: బీఆర్ఎస్‌లోకి(Bharat Rastra Samithi) మహారాష్ట్ర (Maharashtra) నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా(Maharashtra Muslim minority leader Syed Abdul Qadir Maulana), ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (BRS National President and Chief Minister K Chandrashekhar Rao) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేసీఆర్ గులాబీ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేత. ఎన్‌సిపి (NCP) ఉపాధ్యక్షుడు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2019 సంవత్సరంలో ఎన్‌సిపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఎన్‌సిపి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా, మహారాష్ట్ర ఎన్‌సిపి మైనార్టీ అధ్యక్షులుగా పని చేశారు. ఎన్‌సీపీ మహారాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కూడా.
మహారాష్ట్రకు చెందిన ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ నేత కావడంతో సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. మౌలానాకు ఔరంగాబాద్ జిల్లా ప్రాంతాల్లో రాజకీయ పట్టు ఉండటంతో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మేలు చేకూరే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతు నాయకుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే, వైజాపూర్ విధానసభ నియోజకవర్గ నాయకుడు అభయ్ పాటిల్, చిక్కగాంకర్ సాహెబ్, దళిత యువజన నాయకుడు ఏవీన్ష్ వస్మత్, ప్రహ్లాద్ రాఖోండే సాహెబ్, గోరఖ్ పాటిల్, శ్యామ్ కదమ్, గోవింద్ ధెంబారే, దేవానంద్ పాటిల్, తుకారాం సాల్వే, చంద్రవిలాస్ తొంబరే పాటిల్, గజానన్ కదమ్, సంతోష్ పాటిల్, యువనేత ప్రవీణ్ జెతెవాడ్ తదితరులు కూడా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.