త్యాగానికి, భక్తికి ప్రతిరూపం బక్రీద్‌

ABN , First Publish Date - 2023-06-30T00:26:36+05:30 IST

త్యాగానికి, భక్తికి ప్రతిరూపంగా జరుపుకునే బక్రీద్‌ పర్వదిన వేడుకలతో ముస్లింల సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఆకాంక్షించారు.

త్యాగానికి, భక్తికి ప్రతిరూపం బక్రీద్‌
ఉండవల్లిలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- మైనారిటీల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- విశ్వాసం, సేవాభావం బక్రీద్‌ ప్రత్యేకతలు : డీకే అరుణ

గద్వాల టౌన్‌/ గద్వాల/ అయిజ, జూన్‌ 29 : త్యాగానికి, భక్తికి ప్రతిరూపంగా జరుపుకునే బక్రీద్‌ పర్వదిన వేడుకలతో ముస్లింల సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఆకాంక్షించారు. ముస్లింలకు శుభా కాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణ సమీపంలోని ఈద్గా మైదానం వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సంద ర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మైనార్టీ ల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పర్వ దిన వేడుకలు, విశ్వాసానికి, సేవాభావానికి ప్రతీకలుగా నిలిచాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆమె ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పర్వదినం మానవాళి మనుగడకు బాటలు వేయాలని, అన్ని వర్గాల ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలవాలని డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌ చైర్మన్‌ బాబర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ ఎంఏ సుభాన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రామన్‌గౌడ, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మాజిద్‌, కౌన్సిలర్‌ మురళి, బీఆర్‌ఎస్‌ నాయ కులు గోవిందు, సాయిశ్యాంరెడ్డి, సీతారాములు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కృష్ణవేణి, అసెంబ్లీ కన్వీనర్‌ రామాం జనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, నాయకులు నాగేంద్రయాదవ్‌, నరసింహ, ఎంకే సత్యం, కాంగ్రెస్‌ నాయకులు ఎండీ ఇసాక్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌ రెడ్డి, నల్లారెడ్డి, అల్గెజాండర్‌, రఘునాయుడు పాల్గొన్నారు. సాముహిక ప్రార్థనల అనంతరం ముస్లింలకు ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్‌ మున్నాబాషా, పట్టణ అధ్యక్షుడు బంగి సుదర్శన్‌, వైఎస్సాఆర్‌టీపీ జిల్లా కో ఆర్డినెటర్‌ అతిక్‌ ఉర్‌ రెహమాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

- గద్వాల మండల పరిధిలోని గోనుపాడు ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబురామన్‌ గౌడ, పీఏసీయస్‌ అధ్యక్షుడు సుబాన్‌, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుపాడు మజీద్‌, కౌన్సిలర్‌ మురళీ తదితరులున్నారు.

ఆచార వ్యవహారాలను గౌరవిద్దాం

ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ వ్యక్తిపై ఉందని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. గురువారం బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని అయిజ పట్టణంలోని ఎక్లాస్‌పూర్‌ రహదారిలో ఉన్న ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు సంకాపూర్‌ రాముడు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ బక్రీద్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- వడ్డేపల్లి, ఉండవల్లి, అయిజ, ఎర్రవల్లి చౌరస్తా, ఇటిక్యాల, మానవపాడు, మల్దకల్‌, కేటీదొడ్డి, రాజోలి మండలాల్లో బక్రీద్‌ పర్వదినం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Updated Date - 2023-06-30T00:26:36+05:30 IST