సబ్‌ జైలు స్థలాన్ని పరిశీలించిన డీఐజీ

ABN , First Publish Date - 2023-02-27T23:03:56+05:30 IST

జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో శిథిలావస్థలో ఉన్న సబ్‌ జైలు స్థలాన్ని సోమవారం హైదరాబాద్‌ రేంజ్‌ జైళ్ల శాఖ డీఐజీ మురళీబాబు పరిశీలించారు.

సబ్‌ జైలు స్థలాన్ని పరిశీలించిన డీఐజీ
సబ్‌ జైలు స్థలాన్ని పరిశీలిస్తున్న హైదరాబాద్‌ రేంజ్‌ జైళ్ల శాఖ డీఐజీ మురళీబాబు

నారాయణపేట, ఫిబ్రవరి 27 : జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో శిథిలావస్థలో ఉన్న సబ్‌ జైలు స్థలాన్ని సోమవారం హైదరాబాద్‌ రేంజ్‌ జైళ్ల శాఖ డీఐజీ మురళీబాబు పరిశీలించారు. ఈ స్థలంలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు గురించి పరిశీలించడంతో పాటు ఎస్పీ వెంకటేశ్వర్లుతో బంక్‌ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేసి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సబ్‌ జైలర్‌ వెంకటేష్‌, సీఐ రవిబాబు, ఎస్‌ఐ సురేష్‌ ఉన్నారు.

Updated Date - 2023-02-27T23:03:58+05:30 IST