అందరి దీవెనలతోనే గద్వాల అభివృద్ధి

ABN , First Publish Date - 2023-05-15T23:28:36+05:30 IST

అందరి దీవెనలు, అభిమానంతోనే గద్వాలను అభివృద్ధి చేశామని, జిల్లాను సాధించు కోగలిగామని డీకే అరుణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.

అందరి దీవెనలతోనే గద్వాల అభివృద్ధి
ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న డీకే అరుణ, హాజరైన దైవ సేవకులు

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

- దైవ సేవకులతో ఆత్మీయ సమ్మేళనం

గద్వాల, మే 15 : అందరి దీవెనలు, అభిమానంతోనే గద్వాలను అభివృద్ధి చేశామని, జిల్లాను సాధించు కోగలిగామని డీకే అరుణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. గద్వాల ప్రాంత అభివృద్ధి పూర్తిగా తన హయాంలోనే జరిగిందని వివరించారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. అందులో భాగంగా చర్చిల అభివృద్ధికి తోడ్పడ్డానని చెప్పారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రోడ్లు, కాలేజీలు, పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ ఇలా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి జిల్లాను సాధించుకోగలిగానని అన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్‌ నిర్మాణంలో కూడా తన శ్రమ ఉందని గుర్తు చేశారు. గద్వాల అభివృద్ధికి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు జమ్మిచేడు ఆనంద్‌, బీజే వైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, రాజశేఖర్‌రెడ్డి, జాన్‌, మక్బూల్‌ తదితరులు పాల్గొన్నారు.

యువతను నట్టేట ముంచిన కేసీఆర్‌

నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ నిరుద్యోగులను, యువతను నట్టేట ముం చాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. గద్వాల మండలం పరమాల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పలువురు సోమవారం బీజేపీలో చేరారు. డీకే అరుణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఓట్లు దండుకున్న కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని పిలుపు నిచ్చారు. భవిషత్తు యవతరానిదేనని, వారికి అండగా ఉంటామని చెప్పా రు. పార్టీలో చేరిన వారిలో వంశీ, సటిక బాబు, నర్సిం హ, చందు, లక్ష్మణ్‌, వరుణ్‌, రాజు, జమ్మన్న, రాందాసు, రాములు, మహేష్‌, శ్రీకాంత్‌, ప్రభుదాసు, పరశు, ప్రేమ్‌కుమార్‌, సంజయ్‌, నాగరాజు, అజయ్‌ కార్తీక్‌, సత్యన్న, గంట నాగరాజు, రాములు, దౌలమ్మ, ఎస్తేరమ్మ, లక్ష్మీదేవి, తిమ్మక్క ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, పాండురంగా రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-15T23:28:36+05:30 IST