వెట్టి చాకిరీపై ఆమె పోరాటం అందరికీ స్ఫూర్తి

ABN , First Publish Date - 2023-09-26T23:20:47+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తి అని ఎమ్మార్పీఎస్‌(ఆర్‌ఆర్‌)జిల్లా ఇన్‌చార్జి ఆర్‌. అశోక్‌ అన్నారు.

వెట్టి చాకిరీపై ఆమె పోరాటం అందరికీ స్ఫూర్తి
జడ్చర్లలో ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్ల్‌ లక్ష్మి

- చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాల్లో నాయకులు

పాలమూరు, సెప్టెంబరు26 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తి అని ఎమ్మార్పీఎస్‌(ఆర్‌ఆర్‌)జిల్లా ఇన్‌చార్జి ఆర్‌. అశోక్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో చాకలి ఐలమ్మ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు పరమేశ్వర్‌తో కలిసి మాట్లాడారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాటం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పి.రమేష్‌, యాంకి రమేష్‌, బాలన్న, చెక్కల దినేష్‌; నరసింహులు, తిరుమలయ్యలు పాల్గొన్నారు.

ఫ తెలంగాణ ప్రజల్లో సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం చాకలి ఐలమ్మ అని ఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మల్లెపోగు శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. నాయకులు నరేష్‌, శ్రీను, యాదగిరి, సాయి, కుమార్‌ పాల్గొన్నారు.

ఫ జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాక లి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో నేషనల్‌ రిజర్వేషన్‌ సమితి జాతీయ కన్వీన ర్‌ నడిమిండి శ్రీనివాసులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లు అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, శేఖర్‌, శివ ప్రసాద్‌, శ్రీను, నాగరాజు, లక్ష్మయ్య, రాజేశ్‌, శ్యామ్‌, శ్రీనివాస్‌, యాదయ్య, కృష్ణ, మల్లేష్‌, ప్రజాసంఘాల నాయకులు కృష్ణయాదవ్‌, శేఖర్‌యాదవ్‌, కౌన్సిలర్‌ బుక్క మహేష్‌, మాజీ సర్పంచ్‌ బుక్క వెంకటేశ్‌ పాల్గొన్నారు.

మునిసిపల్‌ కార్యాలయంలో : జడ్చర్ల మునిసిపాలిటీ కార్యాలయంలో చాకలిఐలమ్మ చిత్రపటానికి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కౌన్సిలర్లు లత, సతీష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పిట్టల మురళి, వెంకటేశ్‌, అలీమ్‌, ఆండాలు, హఫీజ్‌, రషీద్‌, వేణు పాల్గొన్నారు.

ఫ భూత్పూర్‌ : మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, వైస్‌ ఎంపీపీ నరేష్‌కుమార్‌గౌడ్‌ తదితరులు చాకలి అఐలమ్మ జయంతినిఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో మున్నీ, ఎంపీవో విజయ్‌ కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రహెమాన్‌, ఏపీవో విమల పాల్గొన్నారు.

ఫ బాలాగనర్‌ : మండలంలోని వివిధ గ్రామాలలో, మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు యాదయ్య, నాయకులు రాములు, భాస్కర్‌, కృష్ణయ్య, పెంటయ్య, శ్రీకాంత్‌, నాయకులు పాల్గొన్నారు.

ఫ అడ్డాకుల : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని కందూరులో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో రజకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T23:20:47+05:30 IST