బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను సాధిద్దాం

ABN , First Publish Date - 2023-04-05T23:01:30+05:30 IST

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను సాధిద్దా మని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ పేర్కొన్నారు.

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను సాధిద్దాం
జగ్జీవన్‌రామ్‌ చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌

- జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ

- నివాళి అర్పించిన కలెక్టర్‌ శ్రీహర్ష, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 5 : బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను సాధిద్దా మని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ పేర్కొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్ర పటానికి కలెక్టర్‌ శ్రీహర్ష, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్‌రామ్‌ ఎనలేని కృషి చేశారని, ఆయన సేవలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, ఈడీ హరనాథ్‌, కన్య కుమారి, వెంకటేశ్వరరావు, ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు.

సీపీఆర్‌పై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరం

సీపీఆర్‌పై ప్రతీ ఒక్కరి కి అవగాహన అవసరమని కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు. బుధవారం కలెక్టరే ట్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆఽ ద్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఆర్‌ అవగాహన కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ సీపీఆర్‌ శిక్షణను ప్రారంభించారు. కార్డియాక్‌ అరెస్ట్‌ సమస్య ఉత్పన్న మైనప్పుడు ఆ వ్యక్తికి సీపీఆర్‌ చికిత్స చేసి కాపా డవచ్చు అన్నారు. వైద్యులు సీపీఆర్‌ చేసి చూయించారు. ఛాతి ఎడమ భాగంపై చేతులతో ఒత్తిడి పెంచి కృత్రిమ శ్వాస అందించడం ద్వారా ప్రాణం పోసే అవకాశం ఉండటంతో ఈ విధానాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని, దీనిపై ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. విడతల వారిగా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అత్యవసర విభాగాలు మెడికల్‌, పోలీస్‌, మునిసిపల్‌, శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ వివరించారు. అనంతరం శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించారు. డీఎంహెచ్‌వో రాంమనోహర్‌ రావు, పుర చైర్‌పర్సన్‌ గందె అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అంజలి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-05T23:01:30+05:30 IST