న్యాక్‌ ఎ++ గ్రేడ్‌ సాధించుకుందాం

ABN , First Publish Date - 2023-02-26T23:35:54+05:30 IST

డ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ ఎ++ గ్రేడ్‌ సాధించుకుందామ ని ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి అన్నారు.

న్యాక్‌ ఎ++ గ్రేడ్‌ సాధించుకుందాం
పూర్వ విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి

ఫ జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి

ఫ ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

జడ్చర్ల, ఫిబ్రవరి 26 : జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ ఎ++ గ్రేడ్‌ సాధించుకుందామ ని ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి అన్నారు. మార్చి 15, 16న కళాశాలను న్యాక్‌బృందం పర్యటించను న్నదని, ఆ లోపు కళాశాలకు న్యాక్‌ ఎ++ గ్రేడ్‌ సాధించుకునే అంశాలను అభివృద్ధి పరుచుకుం దామని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పా ల్గొన్న సందర్భంగా పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కళాశాలకు న్యాక్‌ ఎ++ గ్రేడ్‌ సాధిస్తే, కళాశాల మరింత అభివృద్ధి చెందు తుందన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్దికి సుమారు రూ.10లక్షలు విరా ళాలు ఇచ్చారని, అందుకు సంబంధించిన వివరా లను కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ సదాశి వయ్య వివరించారు. కళాశాల పూర్వ విద్యార్థి, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు రంగనాథ్‌ కళాశాలలో యోగా కేంద్రం ఏర్పాటుకు రూ. లక్ష విరాళాన్ని ప్రకటిం చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ అప్పియాచిన్నమ్మ, ఆలుమ్ని అధ్యక్షుడు పాలాది రామ్మోహన్‌, కార్యదర్శి బాద్మి రవిశంకర్‌, కన్వీనర్‌ పాలాది శ్రీనివాసులు, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.

కరాటే పోటీలు ప్రారంభం

పట్టణంలోని శ్రీసత్యనారాయణస్వామి దేవాల య ప్రాంగణంలో ఒకినావా స్పోర్ట్స్‌ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలను ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మునిసిపాలి టీలోని 16వ వార్డు శివాజీనగర్‌ కాలనీలోని ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఉచిత మెడికల్‌ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీ త, నాటక అకాడమీ మాజీ చైర్మన్‌ బాదిమి శివ కుమార్‌, కౌన్సిలర్‌లు నందకిశోర్‌గౌడ్‌, ప్రశాంత్‌ రెడ్డి, సతీష్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు శ్యామ్‌, కృష్ణారెడ్డి, బాబా, నాగిరెడ్డిలతో పాటు కరాటే మాస్టర్‌ శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-26T23:36:08+05:30 IST