Share News

గద్వాలను బహుజనుల అడ్డాగా మార్చుదాం

ABN , First Publish Date - 2023-10-19T23:45:19+05:30 IST

గద్వాలను బహుజనుల అడ్డాగా మార్చుదామని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

గద్వాలను బహుజనుల అడ్డాగా మార్చుదాం
జడ్పీ చైర్‌పర్సన్‌ సరితను గజమాలతో సన్మానిస్తున్న నాయకులు, కార్యకర్తలు

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- కాంగ్రెస్‌ పార్టీలో పలువురి చేరిక

గద్వాల, అక్టోబరు 19 : గద్వాలను బహుజనుల అడ్డాగా మార్చుదామని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపుతో గద్వాల అభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని చెప్పారు. గద్వాల పట్టణంలోని జిల్లా పరిషత్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. చైర్‌పర్సన్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ గద్వాలలో బీసీ మహిళకు అవకాశం ఇచ్చిందని వివరించారు. సహించలేని కొందరు వ్యక్తులు దీన్ని వ్యతిరేకిస్తున్నారని, వారి అసలు నైజాన్ని బయటపెట్టిపోయారని విమర్శించారు. ఈ సందర్భంగా గద్వాల మండలం బస్రచెరువు గ్రామానికి చెందిన బ్రహేశ్వర్‌రెడ్డితో పాటు 100 మంది, కేటీదొడ్డి మండలం చమన్‌ఖాన్‌దొడ్డి సర్పంచు నాగరాజు, ఉపసర్పంచ్‌ గడ్డం రామయ్య, వార్డు మెంబర్లుతో పాటు 200 మంది, ధరూర్‌ మండలం ఆల్వాల్‌ పాడు గ్రామం నుంచి 100 మంది, గద్వాల తాలుకా గౌడ సంఘం నాయకులు జనార్దన్‌గౌడ్‌, వెంకటస్వామి గౌడ్‌, సాంబశివగౌడ్‌, ఆలూరు నర్సన్న గౌడ్‌తో పాటు 50 మంది చేరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ బండ్ల లక్ష్మీదేవి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీని వాస్‌గౌడ్‌, ఆనంద్‌గౌడ్‌, నాగేందర్‌యాదవ్‌ తదిత రులు పాల్గొన్నారు.

తండాల అభివృద్ధిపై గత పాలకుల నిర్లక్ష్యం

కేటీదొడ్డి : గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తండాలు అభివృద్ధి చెందలేదని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. ‘తిరగబడదాం - తరమికొడదాం’ కార్యక్రమంలో మండలంలోని పూజారితండా, తోట తండా, తూర్పుతండా గ్రామాల్లో గురువారం ఆమె బండ్ల లక్ష్మీదేవితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు బండ్ల లక్ష్మీదేవి చంద్ర శేఖర్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్‌, వెంకట్రామిరెడ్డి, కృష్ణమూర్తి, సర్పంచులు పార్వతమ్మ, తాన్యానాయక్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వీరన్న, రాజు, వీరేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-19T23:45:19+05:30 IST