వైకల్యాన్ని జయించిన లూయిస్‌ బ్రెయిలీ

ABN , First Publish Date - 2023-01-04T23:26:50+05:30 IST

లూయిస్‌ బ్రెయిలీ వైకల్యాన్ని జయించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహనీయుడని మహిళ, శిశు సంక్షేమశాఖాధికారి ముషాహిదాబేగం అన్నారు.

వైకల్యాన్ని జయించిన లూయిస్‌ బ్రెయిలీ
అంధుల పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముషాహిదాబేగం, జమ్మిచేడు పాఠశాలలో అంధ ఉపాధ్యాయుడిని సన్మానిస్తున్న సహోద్యోగులు

- మహిళ, శిశు సంక్షేమశాఖాధికారి ముషాహిదా బేగం

గద్వాల క్రైం/ గద్వాల టౌన్‌, జనవరి 4 : లూయిస్‌ బ్రెయిలీ వైకల్యాన్ని జయించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహనీయుడని మహిళ, శిశు సంక్షేమశాఖాధికారి ముషాహిదాబేగం అన్నారు. లూయిస్‌ బ్రెయిలీ జయంతి సందర్బంగా గద్వాల పట్టణం, రాఘవేంద్ర కాలనీలోని అంధుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొ న్నారు. చిన్నారులతో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. లూయిస్‌ బ్రెయిలీ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రెయిలీ కనుగొన్న లిపిద్వారా ఎంతోమంది అంధులైన విద్యార్థులు విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, సంగీత, చిత్ర కళాకారు లుగా, పత్రికాధిపతులుగా, విభిన్న రంగాల్లో రాణించి అగ్ర భాగాన నిలిచారన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో విద్యార్థులు విద్యావంతులుగా ఎదిగి ఉన్నత స్థానా ల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠ శాల కార్యదర్శి రంగన్న, పూర్వ విద్యార్థులు నాగార్జునాచారి, సతీష్‌రెడ్డి, బడేసాబ్‌, బీచుపల్లి, టి.అశోక్‌, శ్రవణ్‌కుమార్‌, చెన్యయ్య పాల్గొన్నారు.

లూయిస్‌ బ్రెయిలీ జయంతి వేడుకలు

గద్వాల రూరల్‌ : మండల పరిధిలోని జమ్మిచేడు పాఠశాలలో బుధవారం బ్రెయిలీ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో పని చేసే దివ్యాంగ ఉపాధ్యాయుడు మౌలాలీ పాషాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మౌలాలీ పాషా మాట్లాడుతూ అంధుల పాలిట బ్రెయిలీ దేవుడని, ఆయన రూపొందించిన లిపిలోనే చదువుకొని నేడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కుటుం బాన్ని పోషించుకుంటున్నానని చెప్పారు. విద్యా వారధి సంస్థ ఆధ్వర్యంలో తనను సత్కరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, ఉపాధ్యాయులు జగదీష్‌ రెడ్డి, సోముసుందర్‌ గౌడ్‌, శాలిమియా, సాయన్న, శ్రీలత, గీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-04T23:26:52+05:30 IST