Harish rao: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్

ABN , First Publish Date - 2023-10-04T15:24:36+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌‌రావు కౌంటర్ ఇచ్చారు.

Harish rao: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్

మహబూబ్‌నగర్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌‌రావు (Minister Harish Rao) కౌంటర్ ఇచ్చారు. బుధవారం మక్తల్ సభలో మంత్రి మాట్లాడుతూ.. మోదీ వచ్చి పెద్ద నీతులు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. మోదీ ది పూటకో మాట.. రాష్ట్రానికో మాట చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ (CM KCR) అద్భుతంగా పని చేస్తున్నాడని పార్లమెంట్‌లో చెప్పారన్నారు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నీళ్లు, ప్రాజెక్టులు, కరెంటు అభివృద్ధి గురించి మాట్లాడితే... ఏపీ నాయకుడు కేసుల గురించి మాట్లాడతారని పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఢిల్లీలో ఒక మాట, తెలంగాణ గల్లీల్లో ఒక మాట అంటున్నారని మండిపడ్డారు. నిన్న కాక మొన్న కర్ణాటకలో దేవెగౌడ్‌తో పొత్తు పెట్టుకున్నావ్... అక్కడ ఏం చెప్తావ్ అని ప్రశ్నించారు. జ్యోతిరాదిత్య సిందియా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ ఎవరు... సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్‌గా రాలేదు ప్రజలు లక్ష ఓట్లతో గెలిపిస్తే ప్రజాక్షేత్రం నుంచి వచ్చి పని చేస్తున్నామని తెలిపారు. ‘‘మీ మాదిరి రాజ్యసభ, మంత్రి పదవులు మాకు కేసీఆర్ ఇవ్వలేదు... ఉద్యమం చెయ్యమని చెప్పాడు. పోరాటాలు, ఉద్యమాలు, జైలుకు పోయినం. మీరు నామినేటెడ్ పదవులు ఇచ్చి కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు. ప్రధాన మంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎన్నికలు వస్తున్నాయని రాజకీయం కోసం మాట్లాడడం చాలా దురదృష్టకరం. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బీ టీం’’ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-04T15:24:36+05:30 IST