పంచాయతీ కార్యదర్శులు.. క్షేత్ర స్థాయిలో ఉండాలి

ABN , First Publish Date - 2023-04-19T23:08:45+05:30 IST

పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో ఉండాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

పంచాయతీ కార్యదర్శులు..  క్షేత్ర స్థాయిలో ఉండాలి
వైద్యసేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రంజిత్‌తో ఆరా తీస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 19 : పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో ఉండాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం నారాయణపేట స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌లో పంచాయతీ కార్యదర్శులకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని, గ్రామాల్లో కార్యదర్శులు చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, డ్రైనేజీలను శుభ్రం చేయించాలని, ప్లాస్టిక్‌ నిషేధానికి కృషి చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులచే పారిశుధ్య పనులు చేయించాలని, పని చేయని కార్మికులను తొలగించే అధికారం కార్యదర్శులకు ఉంటుందన్నారు. మల్లి లేయర్‌ మొక్కలను నాటాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పన్ను విధిగా వసూలు చేయాలని, ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వర్మీ కంపోస్ట్‌ త యారికి వినియోగించే విధంగా పారిశుధ్య కార్యాచరణ ప్రణాళిక చేయాలని ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని, గ్రామా ల్లో రోడ్లపై చెత్త లేకుండా చూడాలని, జాతీ య ఉపాధి హామీ పథకంలో అర్హులైన కూలిలకు జాబ్‌ కార్డులు అందించాలన్నారు. మస్టర్‌ ఆధారంగా కూలీలకు కూలి పెంచి చెల్లించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, సీఈవో జ్యోతి, డీపీవో మురళి, విజయ్‌, ఎంపీటీలు, ఎం పీవోలు, కార్యదర్శులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఈనెల 22 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సమ్మర్‌ క్యాంపు కరప త్రాలను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ క్యాం పులో లైఫ్‌ స్కిల్స్‌, వేద గణితం, ఆర్ట్‌, మ్యూజిక్‌, స్పీకింగ్‌పై విద్యార్థినులకు శిక్షణ ఇవ్వనున్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి

రోగులకు మెరుగైన వైద్య సేవలు అం దించాలని కలెక్టర్‌ వైద్యులను ఆదేశించారు. నారాయణపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని బుధవారం కలెక్టర్‌ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యం కోసం వచ్చిన రోగులకు ఇబ్బందులు కల్గకుండా చేపట్టిన షెడ్ల నిర్మాణ పనులు పరిశీలించి, షెడ్లలో విశ్రాంతి తీసుకునేలా ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని వైద్యులకు సూచించారు. జిల్లా ఆసుపత్రికి కొత్తగా 14 మంది పీజీ వైద్యులు నియమించ బడ్డారని, ప్రస్తుతం ఉన్న వైద్యులతో పాటు జనరల్‌ సర్జన్‌లు, అనస్థిసియా, ఆర్థోపెడిక్‌, రేడియోలాజి, ఈఎన్‌టీ, పాథలోజి, పీడియా ట్రిక్స్‌, స్కిన్‌ స్పెషలిస్ట్‌, పల్మరి మెడిసిన్‌ పోస్ట్‌ వైద్యులు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో డీఈ విజయ్‌ భాస్కర్‌, ఆసుపత్రి సూప రింటెండెంట్‌ డాక్టర్‌ రంజిత్‌, ఏఈ మహేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-04-19T23:08:45+05:30 IST