అధ్యక్షా..

ABN , First Publish Date - 2023-08-05T23:15:02+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలపై అసెంబ్లీలో శనివారం గళమెత్తారు. ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నల్లమల అడవుల్లో పని చేస్తున్న వాచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి నియోజకవర్గంలో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరారు.

అధ్యక్షా..

స్థానిక సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ప్రజాప్రతినిధులు



ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలపై అసెంబ్లీలో శనివారం గళమెత్తారు. ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నల్లమల అడవుల్లో పని చేస్తున్న వాచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి నియోజకవర్గంలో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరారు.

-అచ్చంపేట/భూత్పూర్‌/నారాయణపేట టౌన్‌

వాచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

- ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

నల్లమల అడవుల్లో పని చేస్తున్న వాచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు కోరారు. ఉన్నత చదు వులు చదివి, బీట్‌ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి అడవుల్లో అంత పట్టు ఉండదన్నారు. అడవుల్లో ఉండే ఆదివాసి గిరిజనులు తదితర వర్గాలకు చెందిన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వాచర్లను రెగ్యులర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి

- నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి

నారాయణపేట ని యోజకవర్గంలో ప్రజల డిమాండ్‌ మేరకు కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని నారాయ ణ పేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి ప్రతిపాదించారు. కోయిల్‌కొండ మం డలంలో గార్లపాడు, దామరగిద్ద మండలంలో కాన్‌కూర్తిని మండలాలుగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రస్తావించారు. అందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సానుకూలంగా స్పందించారు. కొత్త మండలాల ఏర్పాటు కోసం ఎస్‌ఆర్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో కొత్త మండలాల కోసం డిమాండ్‌ చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్‌ఎస్‌ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీ కార్మికుల కోర్కెలను అంగీకరించాలి

- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

గ్రామాల్లో పని చేస్తున్న వీవోఏలు, పంచాయతీ కార్మికులు అడుగుతున్న న్యాయబద్దమైన కోరికలను అంగీకరించాలని ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని అడిగారు. వారం రోజుల క్రితం కురిసిన వానాలకు నియోజవర్గంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఎక్కువ నిధులు కేటాయించాలని సంబంధిత మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభ్యులు చెప్పిన విషయాలను నోట్‌ చేసుకు న్నామని, సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-08-05T23:15:02+05:30 IST