ఓన్లీ రీడింగ్‌ అద్దాలే

ABN , First Publish Date - 2023-02-05T22:53:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో రీడింగ్‌ అద్దాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు.

ఓన్లీ రీడింగ్‌ అద్దాలే
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

- మందకోడిగా ‘కంటి వెలుగు’

- 24 బృందాలతో 32,804 మందికి పరీక్షలు

- 5,895 మందికి అద్దాలు పంపిణీ

- 5,671 మందికి అద్దాల కోసం ఆర్డర్లు

నారాయణపేట, ఫిబ్రవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో రీడింగ్‌ అద్దాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వంద రోజుల పాటు 18 ఏళ్లు పై బడిన వారు 2,26,751 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యశాఖ లక్ష్యం పెట్టుకుంది. జిల్లాలో 5,66,874 లక్షల మంది జనాభా ఉండగా, 24 ‘కంటి వెలుగు’ బృందాలు ఉండగా, ఒక్కో బృం దంలో తొమ్మిది మంది చొప్పున 216 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల మూడవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 32,804 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 5,895 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 5,671 మందికి కంటి అద్దాల అవసరమున్నట్లు గుర్తించిన వైద్య సిబ్బంది కంటి అద్దాలు తెప్పించేందుకు ఆర్డర్లు ఇచ్చారు. కాగా నాలుగేళ్ల క్రితం కంటి ఆపరేషన్ల కోసం 15,570 మందిని గుర్తించినా గుర్తింపు నకే పరిమితమైంది. అయితే రెండో విడతలో కేవలం రీడింగ్‌ అద్దాలు మాత్రమే పంపిణీ చేస్తుండడంతో కంటి పొరతో బాధపడుతూ ఆపరేషన్లు అవసరమైన వారికి ఏ మేరకు కంటి ఆపరేషన్లు చేస్తారో అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - 2023-02-05T22:53:18+05:30 IST