ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2023-03-14T23:06:49+05:30 IST
ప్రమాదవశాత్తు పత్తి పంట కాలిపోయి నష్టపోయిన మండలంలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన రైతు కుర్వ హన్మంతుకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఊట్కూర్, మార్చి 14 : ప్రమాదవశాత్తు పత్తి పంట కాలిపోయి నష్టపోయిన మండలంలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన రైతు కుర్వ హన్మంతుకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో పంట నష్టపోయిన రైతును కలిసి పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటకు ధర రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా చెతికి అందదని రైతులు పంటను నిల్వ చేసుకుంటే ప్రమాదవశాత్తు కలిపోయి నష్టపోతున్నారన్నారు. హన్మంతు ఇంట్లో పత్తి నిల్వ చెసుకుంచే రాత్రి విద్యుత్ బల్బు వెడికి నిప్పు అంటుకుని ఐదు క్వింటాళ్ల పత్తి కాలిపోయిందన్నారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా క్వింటాలు పత్తి రూ.12 వేలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. సీపీఎం జిల్లా నాయకుడు నరహరి, రైతు సంఘం నాయకులు శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అశోక్, ప్రజాకళా మండలి నాయకుడు శివ పాల్గొన్నారు.