హోరాహోరీగా సాగిన టీ 20 క్రికెట్‌ సెమీ ఫైనల్స్‌

ABN , First Publish Date - 2023-01-21T23:33:25+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పీఎం కప్‌ టీ20 క్రికెట్‌ పోటీలు ఏడవ రోజు శనివారం సెమీ ఫైనల్స్‌ హోరాహోరీగా కొనసా గాయి.

 హోరాహోరీగా సాగిన టీ 20 క్రికెట్‌ సెమీ ఫైనల్స్‌
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న రామచంద్రారెడ్డి

- ఫైనల్‌కు చేరిన వీరహనుమాన్‌ గద్వాల, ఢిల్లీ జట్లు

గద్వాల అర్బన్‌, జనవరి 21 : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పీఎం కప్‌ టీ20 క్రికెట్‌ పోటీలు ఏడవ రోజు శనివారం సెమీ ఫైనల్స్‌ హోరాహోరీగా కొనసా గాయి. జిల్లా కేంద్రంలోని సోమనాద్రి ఫుట్‌బాల్‌ మినీ స్టేడియంలో ఏడవరోజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఉదయం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఢిల్లీ, ముంబయి జట్ల మధ్య పోటీ జరగగా, ముంబయి జట్లు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్లు నిర్ణీత 15 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు 12.4ఓవర్లలో 110 పరుగు చేసి ఆల్‌ఔట్‌ కాగా, 92 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. అనంతరం ఉదయం 12గంటలకు జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో వీరహనుమాన్‌ గద్వాల, బెంగుళూరు జట్లు తలపడగా, టాస్‌ గెలిసిన వీరహనుమాన్‌ గద్వాల జట్లు బౌలింగ్‌ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వీరహనుమాన్‌ గద్వాల జట్టు 14.5 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 174 పరుగులు సాధించి 9 వికెట్ల తేడాతో ఫైనల్‌కు చేరుకుంది. మధ్యాహ్నం రెండవ సెమీ ఫైనల్స్‌లో ఢిల్లీ, హైదరాబాద్‌ స్టార్స్‌ జట్లు తడపడగా, హైదరాబాద్‌ జట్లు టాస్‌ గెలిసి బౌలింగ్‌ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్‌కు దిగన ఢిల్లీజట్లు నిర్ణీత 16ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా, అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ స్టార్స్‌ జట్టు 16 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి ఓటమిపాలు కాగా, 62 పరుగుల తేడాతో ఢిల్లీజట్లు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. క్వాటర్స్‌, సెమీ ఫైనల్స్‌ పోటీల్లో క్రీడాకారులు ఫోర్లు, సిక్సర్లతో తైరుమైదానం మారుమోగించడంతో క్రికెట్‌ అభిమానులు, బాణసంచా, కేరింతలు మిన్నంటాయి. కాగా, ఆదివారం ఉదయం 9 గంటలకు వీరహనుమాన్‌ గద్వాల, ఢిల్లీ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ప్రా రంభవు తుం దని నిర్వాహకులు జిల్లా అధ్యక్షుడు మురారి సోమశేఖర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్ర మంలో తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు మురారి సోమశేఖర్‌ రెడ్డి, టీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డీటీడీసీ నరసిం హా, ట్రెజ రర్‌ శ్రీధర్‌, లీగల్‌ అడ్వయిజర్‌ నరేందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళి, సెక్రట రీలు అనీల్‌, కృష్ణ, టీసీఏ కోచ్‌లు ప్రవీణ్‌, జియా, గద్వాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడు బండల వెంకట్రాములు, కౌన్సిలర్‌ త్యాగరాజు, సీనియర్‌ క్రీడాకారులు సత్య నారాయణ, దేవదాసు, శ్రీనివాసులు, ఫుట్‌బాల్‌ విజయ్‌ ఉన్నారు.

Updated Date - 2023-01-21T23:33:26+05:30 IST