‘మన ఊరు-మన బడి’ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-03-06T23:21:08+05:30 IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ పాఠశాల, మరికల్‌ మండల కేంద్రంలోని బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలలతో పాటు, తీలేరు గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన పరిశీలించారు.

‘మన ఊరు-మన బడి’ పనులు పూర్తి చేయాలి
విద్యార్థుల పుస్తకాలను పరిశీలిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన

- రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన

- పేట జిల్లాలో పాఠశాలల పరిశీలన

- విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టిన కమిషనర్‌

నారాయణపేట/మరికల్‌, మార్చి 6 : నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ పాఠశాల, మరికల్‌ మండల కేంద్రంలోని బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలలతో పాటు, తీలేరు గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన పరిశీలించారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా తీలేరులో చేపట్టిన పాఠశాల నిర్మాణ పనులను ఆమె పరిశీలించి, పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకు పెయింటింగ్‌ వేసిన తరువాత శుభ్రం చేయాలని కాంట్రాక్టర్‌ను మందలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో నేర్చుకున్న పాఠ్యాంశాలపై ప్రశ్నలు వేసి సమాధా ం రాబట్టారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేస్తూ చాక్లె ట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల పక్కన కూర్చొని పాఠాలను వింటూ, ఉపాధ్యా యుల యాక్షన్‌ ప్లాన్‌ను పరిశీలించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని బాలు ర ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న నూతన భవనాన్ని పరిశీలించారు. బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను, విద్యార్థులు చేతులు కడిగే పరిసరాలను, మరుగుదొడ్లను పరిశీలించారు. పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలని అఽఽధికారులకు సూచించారు. అనంతరం ఆమె జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి, మాట్లాడారు. ‘మన ఊరు-మన బడి’ కింద నిధులకు లోటు లేదని, పనులు త్వరగా పూర్తిచేసి విద్యా ప్రమాణాలు మెరుగు పడేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కోయశ్రీహర్ష, జేసీ మయాంక్‌ మిట్టల్‌, డీఈ వో లియాఖత్‌అలీ, సర్పంచ్‌ రేవతమ్మ, హెచ్‌ఎం అనురాధ, దత్తాత్రేయ, మనోరంజనీ, ఎస్‌ఎంసీ చైర్మన్లు నర్సిములు, కుర్మన్నగౌడ్‌, ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా, ధన్వాడ మండలం కేజీబీవీలో కొనసాగుతున్న మరికల్‌ మండల కస్తూర్బా పాఠశాలలో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన బీఎస్పీ నాయకులపై పోలీస్‌ కేసు పెట్టించిన జీసీడీవో పద్మనళిని, కస్తూర్భా ఎస్‌వో గంగమ్మపై విచారణ జరిపించాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య కమిషనర్‌ దేవసేనకు మరికల్‌లో వినతిపత్రం అందించారు.

Updated Date - 2023-03-06T23:21:08+05:30 IST