యోగి వేమన జయంతిని అధికారికంగా జరపాలి
ABN , First Publish Date - 2023-01-19T23:01:36+05:30 IST
సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన జయంతి, వర్ధంతిని తెలం గాణ ప్రభుత్వం అధికారికంగా జరపాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ డిమాండ్ చేశారు.
- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ
వనపర్తి టౌన్, జనవరి 19 : సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన జయంతి, వర్ధంతిని తెలం గాణ ప్రభుత్వం అధికారికంగా జరపాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వేమన పద్యాలలో సమాజహితం ఉంటుందని, అలతి పదాల పద్యాలతో అనంత అర్థం ఉంటుం దన్నారు. పాతుకుపోయిన దురాచారాలు, మూఢ నమ్మకాలు, మోసాలు, లోపాలు, తప్పులను ఎత్తి చూపారని అన్నారు. వేమన పద్యాలు తెలియని తెలుగు ప్రజలు లేరని, ఆయనను స్మరించుకోవ డం పాలకుల, ప్రజల కర్తవ్యమన్నారు. కర్ణాటక రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా వేమన ఉత్సవా లను నిర్వహిస్తున్నారని, తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా వేమన ఉత్సవాలను అధికారికంగా నిర్వ హించేందుకు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. గురు వారం వేమన 351వ జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిందని, తెలం గాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం విచారకర మన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐ ఎస్‌ఎఫ్ డివిజన్ కార్యదర్శి గోకం వంశీ ఉన్నారు.