Bharat Rashtra Samithi: మార్చి 26న కేసీఆర్ అధ్యక్షతన మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ

ABN , First Publish Date - 2023-03-14T22:23:47+05:30 IST

ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.

Bharat Rashtra Samithi: మార్చి 26న కేసీఆర్ అధ్యక్షతన మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ
K Chandrashekar Rao

హైదరాబాద్: ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) అధినేత, సీఎం కేసీఆర్(K Chandrashekar Rao) అధ్యక్షతన ఈ సభ జరగనుంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవలి నాందేడ్ సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్‌లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్‌పై స్థానిక నాయకుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్‌లో చేరేందుకు ముందుకు వచ్చారు. మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్ (భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ సిఎం అశోక్ చౌహాన్ మీద కేవలం వెయ్యి వోట్ల తేడాతో ఓడిపోయారు). ఎన్సీపి నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపి యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, ఎన్సీపి నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపి అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపి లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపి కాందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు అడ్వొకేట్ విజయ్ ధోండగే, ఎన్సీపి యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే తదితరులు హైదరాబాదులో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-03-14T22:23:51+05:30 IST