ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండగానే అనారోగ్యానికి గురైన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తల్లి
ABN , First Publish Date - 2023-06-14T13:11:05+05:30 IST
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 60 బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. కాగా.. జూబ్లీహిల్స్‌లోని తమ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తల్లి అమృతమ్మ అనారోగ్యానికి గురయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 60 బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. కాగా.. జూబ్లీహిల్స్‌లోని తమ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తల్లి అమృతమ్మ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఐటీ అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈరోజు ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయి.