Home » IT Raids
ప్రముఖ విద్యాసంస్థ శ్రీ చైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఐటి సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో కూడా సోదాలు చేపడుతున్నారు.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై సహా పలు ప్రాంతాల్లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాల్లో చేపట్టారు.
సినీ నిర్మాత దిల్ రాజ్‌ను ఐటీ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. విచారణకు ఎప్పుడూ పిలిచినా రావాలని సూచించారు.
Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత దిల్ రాజు విచారణ నిమిత్తం ఐటీ కార్యాలయానికి వచ్చారు. రెండు గంటల పాటు ఆయనను విచారించనుంది ఐటీ. ఇటీవల నాలుగు రోజుల పాటు దిల్‌రాజు నివాసంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
IT Raids: కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రేషన్ బియ్యం అక్రమరవాణాపై ఉక్కపాదంమోపి పలు గోడౌన్లలో తనిఖీలు చేపట్టింది. అందులో కూడా సత్యం బాలాజీ కంపెనీ ఉన్నట్లు అధికారులు తేల్చి కేసులు నమోదు చేశారు. కాకినాడ నుంచి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో సత్యం బాలాజీ సంస్థ కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఐటీ దాడులు సాగుతున్నాయి.
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు వరుసగా నాలుగోరోజు కొనసాగాయి.
Dil Raju: నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్‌రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్‌రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాను నటించే సినిమాలకు పారితోషికాన్ని పూర్తిగా వైట్‌లోనే (ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించే డబ్బునే) తీసుకుంటానని ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ వెల్లడించారు.
Dil Raj: టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఐటీ అధికారులపై దిల్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో మూడో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతోన్నాయి. అలాంటి వేళ.. కీలక పత్రాలను ఐటీ శాఖ ఉన్నతాధికారి పరిశీలిస్తు్న్నారు. ఆ సమయంలో ఆమెకు ఆయన వాదనకు దిగారు.