తెలంగాణ ఏర్పాటు తర్వాతే హుస్నాబాద్‌ సస్యశ్యామలం

ABN , First Publish Date - 2023-06-07T23:51:44+05:30 IST

హుస్నాబాద్‌, జూన్‌ 7: ఒకనాడు హుస్నాబాద్‌ నియోజకవర్గం కరువు ప్రాంతం.. ఎండిన చెరువులు, బీటలు బారిన పొలాలు దర్శనమిచ్చేవి. తాగునీటికి నిత్యం గోస పడేది. పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి.. కానీ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాతే హుస్నాబాద్‌ సస్యశ్యామలం
సాగునీటి దినోత్సవ సంబరాల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌

ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌

ఘనంగా సాగునీటి దినోత్సవం

హుస్నాబాద్‌, జూన్‌ 7: ఒకనాడు హుస్నాబాద్‌ నియోజకవర్గం కరువు ప్రాంతం.. ఎండిన చెరువులు, బీటలు బారిన పొలాలు దర్శనమిచ్చేవి. తాగునీటికి నిత్యం గోస పడేది. పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి.. కానీ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎ్‌స)లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన నియోజకవర్గస్థాయి సాగునీటి దినోత్సవ సంబరాల సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 763 చెరువులుండగా 408 చెరువుల వరకు మిషన్‌ కాకతీయలో పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం భూగర్భజలాలు పెంపొందాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, ఎంపీపీలు మానస, లక్ష్మీ, వినీత, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్‌ న్యాయవాది, కవి, రచయిత గులాబిల మల్లారెడ్డి రచించిన ఎద్దు ఎవుసం, సురుకుల వైద్యం, నా లక్ష్యం-నా గమ్యం కవితా సంపుటిలను ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ సాగునీటి దినోత్సవంలో ఆవిష్కరించారు.

అధికారం కోసం అర్రులుచాస్తున్న బీజేపీ, కాంగ్రె్‌సలు

గజ్వేల్‌, జూన్‌ 7: అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు అర్రులు చాస్తున్నారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరాం నేతృత్వంలో, గడ ప్రత్యేకాఽధికారి ముత్యంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅథితిగా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడు భూములుగా ఉన్న రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చారని తెలిపారు. దేశానికి అత్యధికంగా ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ వరుసలో ఉన్నా తెలంగాణపై బీజేపీ కపట ప్రేమను చూపుతుందని ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి అన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణీగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణ అన్నారు. వారితో హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ రాజమౌళి, ఎంపీపీ అమరావతి తదితరులున్నారు.

చెరువులను బాగుచేసిన ఘనత బీఆర్‌ఎ్‌సదే

చిన్నకోడూరు, జూన్‌ 7: గత ప్రభుత్వాలు చెరువుల గురించి పట్టించుకోలేదని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం ద్వారా ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో ఉన్న చెరువుల్లో పూడికతీసి, చెరువు కట్టలను మరమ్మతు చేసిందని ఎంపీపీ మాణిక్యరెడ్డి అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఊరూరా చెరువుల పండుగ నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమేష్‌, పీఏసీఏస్‌ చైర్మన్లు సదానందం, కనకరాజు, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ పాపయ్య పాల్గొన్నారు.

ఊర చెరువుల పండుగను విజయవంతంగా నిర్వహించాలి

హుస్నాబాద్‌రూరల్‌, జూన్‌ 7: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత, చెరువుల మరమ్మతు పథకం చేపట్టి నీటి వనరులను నిల్వ చేసినందుకు గ్రామగ్రామాన చెరువుల పండుగను విజయవంతం చేయాలని ఎంపీపీ లకావత్‌ మానస పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సన్నాహక సమావేశంలో ఎంపీపీ పాల్గొని మాట్లాడారు.

Updated Date - 2023-06-07T23:51:44+05:30 IST