దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయురాలికి పురస్కారం
ABN , First Publish Date - 2023-02-01T23:40:53+05:30 IST
కొండపాక, ఫిబ్రవరి 1: కేరళలో జరిగిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరసనగండ్ల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రూపారాణి పురస్కారం అందుకున్నారు.
కొండపాక, ఫిబ్రవరి 1: కేరళలో జరిగిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరసనగండ్ల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రూపారాణి పురస్కారం అందుకున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎంపికై కేరళలోని త్రిశూర్‌లో జరిగిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో జాయ్‌ఫుల్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ప్రతిభ కనబరిచి భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్ టెక్నాలజికల్ మ్యూజియం ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. కొండపాక మండలం సిరసనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రూపారాణికి ఈ పురస్కారం రావడం పట్ల ఎస్సీఈఆర్టీ ప్రతినిధులు సురే్‌షబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే డీఈవో శ్రీనివా్‌సరెడ్డి, డీఎ్‌సవో శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివా్‌సరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.