మట్టి స్నానంతో మానసిక ప్రశాంతత

ABN , First Publish Date - 2023-05-19T00:29:18+05:30 IST

మట్టి స్నానంతో ఒత్తిడి తొలిగి, మానసిక ప్రశాంతతకు చేకూరుతుందని వ్యాసమహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యోగా గురువు తోట సతీష్‌ అన్నారు.

మట్టి స్నానంతో మానసిక ప్రశాంతత
మట్టి స్నానం చేస్తున్న విద్యార్థులు

సిద్దిపేట అర్బన్‌, మే 18: మట్టి స్నానంతో ఒత్తిడి తొలిగి, మానసిక ప్రశాంతతకు చేకూరుతుందని వ్యాసమహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యోగా గురువు తోట సతీష్‌ అన్నారు. వ్యాస మహర్షి యోగా సొసైటీ సిద్దిపేట ఆధ్వర్యంలో విద్యార్థులకు మొట్టమొదటిసారిగా మట్టి స్నానం కార్యక్రమాన్ని గురువారం చంద్రమౌళి గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి సందర్భంగా విద్యార్థులకు బాల సంస్కార్‌ వేసవి శిక్షణ శిబిరాన్ని 20 రోజులుగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేకంగా మట్టి స్నానం పరిచయం చేశామన్నారు. 70 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ప్రకృతి చికిత్స విధానంలో మట్టి స్నానం చాలా ప్రముఖమైనదని మనిషిని మట్టి నుంచి వేరు చేయలేమన్నారు. కార్యక్రమంలో రవి, మహేష్‌, మల్లికార్జున్‌, శ్రీను, రమేష్‌, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-19T00:29:18+05:30 IST