సిద్దిపేట సమీకృత మార్కెట్‌కు ఐఎ్‌సవో సర్టిఫికెట్
ABN , First Publish Date - 2023-03-25T00:02:42+05:30 IST
సిద్దిపేట పట్టణంలోని సమీకృత మార్కెట్‌కు జాతీయస్థాయి ఐఎ్‌సవో సర్టిఫికెట్ లభించింది.
నాణ్యత, సమగ్ర నిర్వహణ తీరుకు అంతర్జాతీయ గుర్తింపు
సిద్దిపేట అగ్రికల్చర్, మార్చి 24 : సిద్దిపేట పట్టణంలోని సమీకృత మార్కెట్‌కు జాతీయస్థాయి ఐఎ్‌సవో సర్టిఫికెట్ లభించింది. స్వచ్ఛమైన కూరగాయలు, తాజా మాంసం, చేపల అమ్మకం, మార్కెట్‌లో పరిశుభ్రత, సమగ్ర నిర్వహణ పనితీరుకు ఈ గుర్తింపునిచ్చారు. ప్రజల సద్వినియోగంతో పాటు పటిష్టమైన నాణ్యత, నిర్వహణ వ్యవస్థ పాటించడంతో సిద్దిపేట సమీకృత మార్కెట్‌కు ఐఎ్‌సవో గుర్తింపు సాధ్యమైంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఏతపనతో సమీకృత మార్కెట్‌ను నిర్మించుకున్నామో అదే తపనతో మార్కెట్ అంచలంచెలుగా ఎదుగుతుందని, దీనికి ఐఎ్‌సవో గుర్తింపు రావడమే నిదర్శనమని తెలిపారు. పాలకమండలికి శుభాకాంక్షలు తెలిపి వారిని అభినందించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మచ్చ విజితాగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్‌కు ఐఎ్‌సవో సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు. మంత్రికి పాలకమండలి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.