మెదక్‌కు దేశమంతా గుర్తింపు
ABN , First Publish Date - 2023-10-30T00:07:24+05:30 IST
మెదక్ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికవడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు.
ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలను ప్రధాని మోదీ అమ్మేస్తున్నారు : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే
మెదక్, అక్టోబరు 29 : మెదక్ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికవడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. మెదక్‌లో ఆదివారం కాంగ్రెస్ విజయభేరి-2 రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌కు ఆయన హజరై ప్రసంగించారు. ఇందిరాగాంధీ మెదక్ జిల్లాలో నెలకొల్పిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీహెచ్‌ఈఎల్, బీడియల్ కర్మాగారాలను ప్రస్తు ప్రధాని నరేంద్రమోదీ అమ్మజూస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చినప్పటికీ లబ్ధిపొందింది మాత్రం బీఆర్‌ఎస్ నాయకులేనని విమర్శించారు. సోనియాగాంధి తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యేవారే కాదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రోహిత్ వయసులోనే నేనూ రాజకీయాల్లో అడుగు పెట్టా
మైనంపల్లి రోహిత్‌రావు మాదిరిగానే 24 ఏళ్ల వయసులో తాను కూడా రాజకీయాల్లో అడుగుపెట్టానని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ నుంచి రోహిత్ చేస్తున్న వయసులోనే తాను కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ ఓనమాలు దిద్దానన్నారు. రోహిత్‌రావు సంపాదన కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, పేద ప్రజలకు సేవ చేయడం ద్వాదా యువతకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నారని వివరించారు. సీనియర్ రాజకీయవేత్త దివంగత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివా్‌సరెడ్డిని దుబ్బాక నియోజవర్గ ప్రజలు ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని, నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రేవంత్ ప్రసంగాన్ని యువత ఈలలు వేస్తూ ఉత్సాహపర్చారు.
ఖర్గేకు ఘన స్వాగతం
మెదక్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ గంట ఆలస్యంగా 4 గంటలకు ప్రారంభమయింది. మల్లికార్జున ఖర్గే సంగారెడ్డిలో సభను ముగించుకొని హెలిక్యాప్టర్‌లో 3:30 గంటలకు మెదక్‌లోని వెస్లీగ్రౌండ్‌కు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా బోదన్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తాకు చేరుకున్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సురేందర్‌గౌడ్, జీవన్‌రావు, బొజ్జ పవన్, మున్సిపల్ కౌన్సిలర్లు దాయర లింగం, శేఖర్, నాయకులు మంగ మోహన్‌గౌడ్, తాహేర్, పరశరాంగౌడ్, ఆవుల గోపాల్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మెదక్, హవేళిఘనపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల నుంచి వేలాదిమంది యువకులు పాల్గొన్నారు.