మునిగడప గ్రామ పంచాయతీ రికార్డులు స్వాధీనం
ABN , First Publish Date - 2023-01-11T22:30:43+05:30 IST
మండలంలోని మునిగడప గ్రామపంచాయతీకి సంబంధించిన అన్ని రికార్డులను బుధవారం డీఎల్‌పీవో వేదవతి స్వాధీనం చేసుకున్నారు.
జగదేవ్‌పూర్, జనవరి11: మండలంలోని మునిగడప గ్రామపంచాయతీకి సంబంధించిన అన్ని రికార్డులను బుధవారం డీఎల్‌పీవో వేదవతి స్వాధీనం చేసుకున్నారు. గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయని గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువకులు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్, డీపీవోకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారుల అదేశాల మేరకు బుధవారం డీఎల్‌పీవో వేదవతి గ్రామ పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామంలో జరిగిన పనులను, గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. ఆమె వెంట కార్యదర్శి తిరుపతి తదితరులు ఉన్నారు.