మిషన్‌ భగీరథతో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు

ABN , First Publish Date - 2023-06-18T23:49:23+05:30 IST

మంచి నీటి దినోత్సవంలో ప్రజాప్రతినిధులు

మిషన్‌ భగీరథతో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు
రేబర్తి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, సెక్రటరీ

మద్దూరు/వర్గల్‌/నంగునూరు, జూన్‌ 18: మిషన్‌ భగీరథ పథకంతో రాష్ట్రంలో ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని ప్రజాప్రతినిధులు అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం పలు గ్రామాల్లో మంచినీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. వర్గల్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన మంచినీటి దినోత్సవంలో మిషన్‌ భగీరత పథకంపై ప్రజలకు వివరించారు. అంతకుముందు గ్రామస్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వాటర్‌ మెన్‌ మహబుబ్‌, నరే్‌షలను గ్రామ ఉప సర్పంచ్‌ పసుల రమేశ్‌ ముదిరాజ్‌ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సందీ్‌పగుప్తా, మిషన్‌ భగీరథ టీం ఏఈ మహేశ్వరి, మైక్రోబాయిలాజిస్ట్‌ మాధవి, కెమిస్ట్‌ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి మద్దూరు మండలంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేబర్తి గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారితో కలిసి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ తీశారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ లక్ష్మి మాట్లాడారు. ఇంటింటికీ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలను అందిస్తున్నదని తెలిపారు. గతంలో నీటి సమస్య అధికంగా ఉండేదని, నేడు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి, మిషన్‌భగీరథ పథకం ద్వారా గోదావరి జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన నీటితో సంపూర్ణ ఆరోగ్యంగా లభిస్తుందని ఏఈ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాధవ్‌జాదవ్‌, ఉపసర్పంచ్‌ లక్ష్మి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ మంచినీళ్ల పండుగను నిర్వహించారు. మిషన్‌ భగీరథ అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులు నివేదిక చదివి, గ్రామ పంచాయతీల వద్ద నీటి సంరక్షణపై మహిళలచే ప్రతిజ్ఞ చేయించారు. మిషన్‌ భగీరథ సూపర్‌వైజర్‌, వాటర్‌ మెన్‌లను సన్మానించారు. నంగునూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ జయపాల్‌రెడ్డి, ఎంపీటీసీ కోల సునీతమహేందర్‌గౌడ్‌, సొసైటీ చైర్మన్‌ కోల రమేశ్‌గౌడ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ.రహీం పాషా, న్యాయవాది సిరికొండ మణి, మిషన్‌ భగీరథ ఏఈ నర్సింగారావు, శ్యామ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-18T23:49:23+05:30 IST