Share News

కేసీఆర్‌ పాలనలోనే తండాలు బాగుపడ్డాయి

ABN , First Publish Date - 2023-11-05T23:26:34+05:30 IST

గత పాలకులు గిరిజనులను.. తండాలను పట్టించుకోలేదని, కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాకే వారికి మహర్దశ వచ్చిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ పేర్కొన్నారు.

కేసీఆర్‌ పాలనలోనే తండాలు బాగుపడ్డాయి

మంత్రి సత్యవతిరాథోడ్‌

నర్సాపూర్‌, నవంబరు 5: గత పాలకులు గిరిజనులను.. తండాలను పట్టించుకోలేదని, కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాకే వారికి మహర్దశ వచ్చిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ పేర్కొన్నారు. నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా ఆదివారం నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, లేబర్‌ వెల్ఫేర్‌బోర్డు చైౖర్మన్‌ దేవేందర్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ రాకముందు గిరిజనులను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని అన్నాఆరు. కేసీఆర్‌ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా చేసిందని, ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ అన్నిరకాల అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ గిరిజనులు సంతోషంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్‌ పాలన రావాలని, ఇందుకోసం నర్సాపూర్‌ నుంచి సునీతారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనులు నమ్మకానికి మారుపేరని, వారు నిజాయితీతో ఉంటారని అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో తండాల అభివృద్ధికి సీఎం ప్రత్యేకంగా రూ. 56 కోట్లను కేటాయించారని చెప్పారు. ఈ నిధులతో ప్రతీ తండాలో సీసీరోడ్లు, మురికికాల్వల నిర్మాణం చేపట్టామని చెప్పారు. అంతేకాకుండా తండాల్లో బీటీరోడ్ల నిర్మాణానికి రూ. 138 కోట్లు మంజూరు చేశారని తెలియజేశారు. గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీటీసీలు బబియానాయక్‌, కవితాఫూల్‌సింగ్‌, ఎంపీపీ రాజునాయక్‌, ఎంపీటీసీ సంధ్యరాణి, మాజీ ఎంపీపీ లలిత, పీఏసీఎస్‌ చైౖర్మన్‌ రాజుయాదవ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌, గిరిజన నాయకులు రమే్‌షనాయక్‌, రాజేందర్‌నాయక్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-05T23:26:35+05:30 IST