సిద్దిపేటలో రైలు కూత

ABN , First Publish Date - 2023-08-27T00:01:27+05:30 IST

సీఎం కేసీఆర్‌ కార్యదక్షతకు నిదర్శనం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటలో రైలు కూత
సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ట్రయల్‌ రన్‌ను ప్రారంభిస్తున్న హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 27: ఎన్నో ఏళ్లుగా సిద్దిపేట ప్రజలు ఎదురుచూస్తున్న రైలు శనివారం సిద్దిపేటకు చేరుకున్నది. శనివారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే పనుల్లో భాగంగా రైలు ట్రయల్‌ రన్‌ను మంత్రి హరీశ్‌రావు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రైలును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్‌రావుతో రైలువద్ద సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు రైల్వే కోసం గత పాలకులు ఏనాడూ పట్టించుకున్నపాపాన పోలేదన్నారు. సిద్దిపేటకు రైలు రావడం సీఎం కేసీఆర్‌ కార్యదక్షతకు నిదర్శనమని చెప్పారు. సెప్టెంబరు 10న రైల్వే అధికారులు సందర్శించి, తనీఖీ చేసిన తర్వాత, రైలు ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-27T00:01:27+05:30 IST

News Hub