వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

ABN , First Publish Date - 2023-09-15T00:37:15+05:30 IST

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 14: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు.

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా

జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 14: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మట్టి గణపతిని పూజిద్దామని, పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో వినాయకులను ప్రతిష్టంచాలన్నారు. మట్టి విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి వివిధ ప్రాంతాలల్లో ఏర్పాటు చేసే గణేష్‌ మండపాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. పారిశుధ్యం, తాగు నీరు, మొబైల్‌ టాయిలెట్‌, గుంతలు పూడ్చడం వంటి సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఎస్సీ రోహిణీప్రియదర్శిని మాట్లాడుతూ..ప్రతి మండప ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని, ప్రతిచోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం మట్టి వినాయకుని ప్రతిష్టించాలనే పోస్టర్‌ను కలెక్టర్‌, ఎస్పీ ఆవిష్కరించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 17న జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవానికి అన్ని ఏర్పాట్తు పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను అదేశించారు.

జిల్లాలో సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాలి

సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు అధికారులు సిద్ధం కావాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల, పోలీస్‌ ఉన్నతాధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమన్వయంతో అధికారులు విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 579 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌ అనుసంధానం అయ్యేలా రూట్‌ మ్యాప్‌ను రూపొందించాలన్నారు. ప్రతి కేంద్రం వెబ్‌ కాస్టింగ్‌ పరిధిలో ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణపై సందేహాలు ఉంటే తనతో షేర్‌ చేసుకోవాలన్నారు.

Updated Date - 2023-09-15T00:37:15+05:30 IST