సంక్షేమం, అభివృద్ధే కేసీఆర్‌ ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2023-02-24T23:17:55+05:30 IST

ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి 59జీవో కింద అర్హులకు పట్టాలు అందజేత

సంక్షేమం, అభివృద్ధే కేసీఆర్‌ ప్రభుత్వ ధ్యేయం
నర్సాపూర్‌లో పట్టాలు అందజేస్తున్న మదన్‌రెడ్డి, సునీతారెడ్డి

నర్సాపూర్‌, ఫిబ్రవరి 24: సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లో 59 జీవో కింద అర్హులైన 61మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సొంత స్థలాలు లేక ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో 59జీవో కింద వాటిని క్రమబద్ధీరిస్తూ ఇళ్ల పట్టాలను అందజేస్తున్నదని చెప్పారు. ఆ భూమిపై వారికి అన్ని హక్కులు కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణాలో అమలవుతున్నాయన్నారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆంజనేయులు, నాయకులు అశోక్‌గౌడ్‌, నయీమొద్దీన్‌, శేఖర్‌, హబీబ్‌ఖాన్‌, జ్ఞానేశ్వర్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-24T23:17:56+05:30 IST