మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-06-28T00:22:26+05:30 IST

మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ సూచించారు.

మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
అల్లీపూర్‌లో క్లాత్‌ ప్యాడ్‌లను పంపిణీ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

చిన్నకోడూరు, జూన్‌ 27: మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ సూచించారు. మండలంలోని అల్లీపూర్‌, మైలారం, చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం మహిళలకు రుతుప్రేమపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళలు రుతుచక్రంపై ధైర్యంగా చర్చించుకోవాలని సూచించారు. అంతకు ముందుకు బెంగుళూరుకు చెందిన ప్రముఖ డాక్టర్‌ శాంతి మహిళలకు మెన్‌స్ట్రువల్‌ కప్‌లు, క్లాత్‌ ప్యాడ్‌ల ప్రయోజనాల గూర్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలతో ప్రతిజ్ఞ చేయించి, క్లాత్‌ ప్యాడ్‌లు, మెన్‌స్ట్రువల్‌ కప్‌లను పంపిణీ చేశారు. అదేవిధంగా 11 వ విడత పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమకావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని మైలారంలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో డీఏల్‌పీవో మల్లికార్జున్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ వనిత, వైస్‌ ఎంపీపీ పాపయ్య, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో సోమిరెడ్డి, ఐకేపీ ఏపీఏం మహిపాల్‌, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-28T00:22:26+05:30 IST