Revanth Reddy: దేశాన్ని అమ్మేస్తున్న మోదీ, అమిత్ షా: రేవంత్
ABN , First Publish Date - 2023-03-12T19:37:43+05:30 IST
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Union Home Minister Amit Shah)లు దేశాన్ని అమ్మేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Union Home Minister Amit Shah)లు దేశాన్ని అమ్మేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు గుజరాతీ పెట్టుబడిదారులైన ఆదానీ, అంబానీలకు దేశాన్ని అప్పజెప్తున్నారన్నారు. గుజరాత్ మోడల్ (Gujarat model) అంటే ఇదేనా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తీరుస్తామని భరోసా ఇచ్చారు. ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఐదు లక్షల వరకు ప్రభుత్వమే ఖర్చు భరించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. పేదలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ (Gas cylinder)ను అందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
రైతుబంధు డబ్బులన్నీ బెల్ట్‌షాపులకే..
సీఎం కేసీఆర్ (CM KCR) పాలనలో తెలంగాణలో మద్యం ఆదాయం భారీగా పెరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుబంధు డబ్బులన్నీ బెల్ట్‌షాప్‌లకే వెళ్తున్నాయన్నారు. తెలంగాణ మోడల్ అంటే 3వేల వైన్ షాప్‌లు, 60వేల బెల్ట్‌షాప్‌లు అని ఎద్దేవా చేశారు. ఇదేనా కేసీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినా.. ప్రజల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి కానీ తెలంగాణ నిరుద్యోగుల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. తెలంగాణ వచ్చిన ప్రజల కష్టాలు తీరలేదన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తిని కలిగించేందుకే తాను ఈ పాదయాత్ర చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. స్వయంపాలనతో కూడిన సామాజిక తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యమన్నారు.