Tulja Bhavani Reddy: ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూతురు తుల్జా భవానీ షాక్.. ఆక్రమణలో స్థలంలో కీలక ప్రకటన
ABN , First Publish Date - 2023-06-25T15:54:30+05:30 IST
బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి (Muthireddy Yadagiri Reddy) ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి భారీ షాకిచ్చారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ప్రకటించారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని స్వయంగా మీడియా ముందు ఆమె ప్రకటించారు.
చేర్యాల: బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి (Muthireddy Yadagiri Reddy) ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి భారీ షాకిచ్చారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ప్రకటించారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని స్వయంగా మీడియా ముందు ఆమె ప్రకటించారు. తన పేరున రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలో భవానీ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించి క్షమాపణ బోర్డును కూడా ఆ స్థలంలో పెట్టారు.
కబ్జా చేయడమే కాకుండా అడ్డంగా గోడ కట్టిన గోడను కూడా కూల్చి వేయించారు. స్థలాన్ని కోర్టు ప్రక్రియ ద్వారా మున్సిపాలిటీకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉంటూ యాదగిరిరెడ్డి ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం తప్పని మండిపడ్డారు. ఎమ్మెల్యే అవ్వకముందే తన తండ్రికి వెయ్యి కోట్ల ఆస్తులున్నాయని, ఈ పనిచేయకూడనిదని మండిపడ్డారు. తన తండ్రి భూమి కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు చేర్యాల ప్రజలకు క్షమాపణ కోరుతున్నానని భవానీ అన్నారు. కాగా కాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూఆక్రమణపై కూతురు భవానీ బహిరంగంగానే నిలదీస్తున్న విషయం తెలిసిందే.