మార్కెట్‌కు 45,253 బస్తాల ధాన్యం
ABN , First Publish Date - 2023-04-22T00:46:27+05:30 IST
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం రాక కొనసాగుతోంది. గురువారం అమవాస్య కావడంతో మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో శుక్రవారం మార్కెట్‌కు భారీగా వచ్చింది. 45, 253 బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ అధికారులు పేర్కోన్నారు.
సూర్యాపేట సిటీ, తిరుమలగిరి, ఏప్రిల్ 21: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం రాక కొనసాగుతోంది. గురువారం అమవాస్య కావడంతో మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో శుక్రవారం మార్కెట్‌కు భారీగా వచ్చింది. 45, 253 బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ అధికారులు పేర్కోన్నారు. అత్యధికంగా జై శ్రీరామ్ రకం 21,750 బస్తాలు, ఐఆర్64 రకం ధాన్యం 11, 738 బస్తాలు, హెచ్‌ఎంటీలు 11, 458 బస్తాలు రాకా, అత్యల్పంగా సాంబమసూరి 52 బస్తాలు, ఆర్‌ఎన్‌ఆర్ 235 బస్తాలు, హెచ్‌ఎంటీ(పాతవి) 20 బస్తాలు వచ్చాయి. గత కొద్దిరోజులు పేట మార్కెట్‌లో 40 వేల బస్తాలకు తక్కువ కాకుండా ధాన్యం వస్తుంది. అదే విధంగా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు రికార్డుస్థాయిలో ధాన్యం వస్తోంది. గతేడాది ఈసీజన్‌లో అత్యధికంగా 29వేల బస్తాల దాన్యం మార్కెట్ వచ్చింది. శుక్రవారం ఈ సీజన్‌లో అత్యధికంగా 29,300 బస్తాల ధాన్యం మార్కెట్‌కు వచ్చింది.
నేడు పేట మార్కెట్ కు సెలవు
శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు సెలపు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి ఎండీ ఫసియూద్ధీన్ తెలిపారు. ఆదివారం సాధారణ సెలవు కాగా, సోమవారం మార్కెట్ లో వ్యాపార లావదేవీలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. శనివారం, ఆదివారం మార్కెట్‌కు వచ్చిన ధాన్యం ట్రాక్టర్ల ను మార్కెట్ లోపలికి అనుమతించమని ఆయన తెలిపారు. సెలవురోజులలో మార్కెట్‌కు వచ్చిన ధాన్యం ట్రాక్టర్లను మార్కెట్ బయట ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.ఆదివారం సాయంత్రం వరకు మార్కెట్‌లో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను ఎగుమతి చేసిన అనంతరం అదేరోజు అర్ధరాత్రి న మార్కెట్‌లోకి ధాన్యం వాహానాలను అనుమతి ఇస్తామని ఆయన పేర్కొన్నారు.