ప్రజా వ్యతిరేక బీఆర్‌ఎ్‌సను ఓడించాలి: సీపీఎం
ABN , First Publish Date - 2023-10-19T00:22:06+05:30 IST
వచ్చే ఎన్నికల్లో ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీఆర్‌ఎ్‌సను ఓడించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు అన్నారు.
సూర్యాపేట సిటీ, అక్టోబరు 18 : వచ్చే ఎన్నికల్లో ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీఆర్‌ఎ్‌సను ఓడించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు అన్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు బుధవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని నిలిపివేయించాలన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో హామీలను అమలు చేయలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ నిజస్వరూపం తెలిసిన ఆ పార్టీ కార్యకర్తలు బీఆర్‌ఎ్‌సకు రాజీనామలు చేసి, ఇతర పార్టీల్లో చేరడం శుభ పరిణామన్నారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రె్‌సతో కలిసి పనిచేస్తామన్నారు. అనంతరం పార్టీ, ప్రజాసంఘాల నిర్మాణం అనే అంశంపై సీపీఎం రాష్ట్ర కమిటీసభ్యులు సోమయ్య బోధించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్‌రావు, మట్టిపెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటశ్వర్‌రావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.