ప్రభుత్వవిప్‌గా బీర్ల అయిలయ్య
ABN , Publish Date - Dec 16 , 2023 | 12:32 AM
ప్రభుత్వవి్‌పగా ఆలేరు శాసన సభ్యుడు బీర్ల అయిలయ్య శుక్రవారం నియామకమయ్యారు. ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటిసారి గెలుపొందిన బీర్ల అయిలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్
ఆలేరు రూరల్, డిసెంబరు 15: ప్రభుత్వవి్‌పగా ఆలేరు శాసన సభ్యుడు బీర్ల అయిలయ్య శుక్రవారం నియామకమయ్యారు. ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటిసారి గెలుపొందిన బీర్ల అయిలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వ విప్‌లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నలుగురిని ప్రభుత్వ విప్‌గా నియమించగా అందులో ఆలేరు ఎమ్మెల్యే ఒకరు. ప్రభుత్వ విప్‌గా నియామకమైన అయిలయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ తనకు ప్రభుత్వ విప్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవకాశాన్ని కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పదవి ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే అదృష్టం కలిగిందన్నారు. ప్రభుత్వ విప్‌గా బీర్ల నియామకాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు.