‘ఫణిగిరి’ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
ABN , First Publish Date - 2023-07-18T00:53:44+05:30 IST
ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఫణిగిరి గ్రామంలోని బౌద్ధ మ్యూజియంలో బుద్ధుడి శిల్పాలు, కళాఖండాలను శివనాగిరెడ్డి బృందం పరిశీలించింది.
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
నాగారం, జూలై 17: ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఫణిగిరి గ్రామంలోని బౌద్ధ మ్యూజియంలో బుద్ధుడి శిల్పాలు, కళాఖండాలను శివనాగిరెడ్డి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుత బౌద్ధ శిల్పాలు, కట్టడాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం శాతవాహన, ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ1నుంచి 3వశతాబ్దం) నాటి శిల్పుల నైపుణ్యంతో చైత్యాలు, విహారాలు, పాలరాతి శిల్పాలతో బౌద్ధారామంగా ప్రసిద్ధిగాంచిందన్నారు. అమెరికాదేశం న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి బౌద్ధ శిల్పాలు ఎంపిక కావడంతో ఈ ప్రాంతం ఎం తో ప్రాముఖ్యం సంతరించుకుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గట్టు నరసింహారావు, పరిశోధన సభ్యులు సనాతన మైత్రేయ, జితేందర్ , మ్యూజియం అసిస్టెంట్ గట్టు వీరయ్య పాల్గొన్నారు.