జాతీయస్థాయి ప్రమాణాలతో మార్కెట్‌ నిర్మాణం

ABN , First Publish Date - 2023-09-23T00:46:13+05:30 IST

సూర్యాపేటలో రూ.30కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల్లో 2.5 లక్షల చదరపు ఆడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నానవెజ్‌ మార్కెట్‌ను నిర్మించామని విద్యుత విద్యుత శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

జాతీయస్థాయి ప్రమాణాలతో మార్కెట్‌ నిర్మాణం
సూర్యాపేట ఇంటిగ్రేటేడ్‌ మోడల్‌ మార్కెట్‌ ప్రత్యేకతలను విద్యార్థులకు వివరిస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట సిటీ, సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 22: సూర్యాపేటలో రూ.30కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల్లో 2.5 లక్షల చదరపు ఆడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నానవెజ్‌ మార్కెట్‌ను నిర్మించామని విద్యుత విద్యుత శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఎడ్యుకేషనల్‌ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌ లిటిల్‌ ప్లవర్‌ జూనియర్‌ కళాశాల ఇంటర్మీడియట్‌ విద్యార్థినీ, విద్యార్థులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డిని విద్యార్థులు కలుసుకున్నారు. మార్కెట్‌ నిర్మాణం, మార్కెట్‌ ప్రత్యేకతలను విద్యార్థులకు మంత్రి వివరించారు. జర్మన టెక్నాలజీతో 10ఎంఎం మందం యూవీ ఆల్ర్టా వైలెట్‌ ఫిల్టర్‌ డూమ్‌ స్కైలైట్‌ గా ఏర్పాటు చేశామన్నారు. స్కైలైట్‌ ప్రత్యేక లైజర్‌ బ్లో పైప్‌ ద్వారా ప్రతి దుకాణంలో రోజుకు 9 నుంచి 10 గంటల పాటు పగటిపూట వెలుగు ఉంటుందన్నారు. ఒక్క యూనిట్‌ కరెంటు కూడా వెలుతురు కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోవడం ఈ మార్కెట్‌ ప్రత్యేకత అన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎ.వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి ఎండీ ఫసియుద్ధీన, మునిసిపల్‌ కమి షనర్‌ పి. రామాంజులరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉప్పల ఆనంద్‌, మార్కెట్‌ సూపర్‌వైజర్లు సమీవుద్దీన, కృష్ణ, సుధీర్‌, యూడీసీ ఖాసీం, హైదారాబాద్‌ లిటిల్‌ ప్లవర్‌ జూనియర్‌ కళాశాల పిన్సిపాల్‌ అరుణ్‌ప్రకాష్‌, అధ్యాపకులు నాగార్జునకుమార్‌, రాజశేఖర్‌, వాణి, వాసవి, వరుణ్‌రెడ్డి, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

షెడ్యూల్‌ కులాల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి

రాష్ట్రంలో షెడ్యూల్‌ కులాల హక్కుల పరిరక్షణ కోసం ఎస్సీ కమిషన పాటుపడాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన సభ్యుడిగా ఎన్నికైన జిల్లా శంకర్‌ను జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంకర్‌ను అభినందించి మాట్లాడారు.

మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో నియోజకవర్గంలోని 455మంది లబ్ధిదారులకు రూ.96.57కోట్ల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన పెరుమాళ్ల అన్నపూర్ణ, ఆర్డీవో వీరబ్రహ్మాచారి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

అబివృద్దిని చూసే చేరికలు

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అబివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నరని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పెనపహాడ్‌ మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎ్‌సలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య, మండల అధ్యక్షుడు యుగంధర్‌, ఎంపీటీసీ నాగరాజు, రామకృష్ణ, జానకి, రాములు, పెద్దులు, లింగమ్మ, సైదులు, మధు, నాగరాజు, ఎల్లయ్య, నరేష్‌, నర్సమ్మ, వంశీ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:46:13+05:30 IST