నిత్యకైంకర్యాలు.. కూడారై పర్వాలు
ABN , First Publish Date - 2023-01-12T00:11:04+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆల య సన్నిధిలో బుధవారం నిత్య కైంకర్యాలు, ధనుర్మాసోత్సవాలు శాస్త్రోక ్తంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట, జనవరి 11: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆల య సన్నిధిలో బుధవారం నిత్య కైంకర్యాలు, ధనుర్మాసోత్సవాలు శాస్త్రోక ్తంగా నిర్వహించారు. ప్రభాతవేళ ప్రధానాలయంలో కొలువుదీరిన ఆం డాళ్(గోదాదేవి) అమ్మవారిని ఆరాదిస్తూ తిరుప్పావై వేడుకలను వైభ వంగా నిర్వహించారు. గోదాదేవి శ్రీరంగనాథుని భర్తగా కాంక్షిస్తూ ఆలపి ంచిన తిరుప్పావై పాశురాలను పఠించిన ఆచార్యులు పాశుర వైభవాన్ని భక్తులకు వివరించారు. మధ్యాహ్నం ఆండాళ్ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాలు, వజ్రాభరణాలతో దివ్యమనోహరంగా అలం కరిం చిన ఆచార్యులు ఆలయ మొదటి ప్రాకార మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. ధనుర్మాస వేడుకల్లో భాగంగా నీరాటోత్సవ పర్వాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. అమ్మవారిని కూడారై పాశురంతో కొలిచి వెండి గంగాళంలో క్షీరాన్నం(పాయసం) ప్రసాదాలను నివేదిం చారు. పెళ్ల్లి కూతురు అలంకరణలో ఉన్న ఆండాళ్ అమ్మవారిని కొలుస్తూ మహిళా భక్తులు మంగళనీరాజనాలను సమర్పించారు. ఐదు రోజుల పా టు నిర్వహించే నీరాటోత్సవాల్లో రెండో రోజు ప్రియ వల్లభుడు శ్రీరం గనాఽథుడిని గోదాదేవి చేరుకునే ఘట్టాలు నేత్రపర్వంగా సాగాయి. యా దగిరీశుడి సన్నిధిలో బుధవారం నిత్యవిధి కైంకర్యాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా జరిగాయి. గర్భగుడిలోని స్వయంభువులను అర్చకులు వేదమంత్రపఠనాలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృ తాభిషేకం చేసి, తులసీదళాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, నిత్య రుద్ర హవనం, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.12,17,281 ఆదాయం సమకూరింది.