ఎంపీ వెంకట్‌రెడ్డిపై హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2023-04-05T00:14:37+05:30 IST
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకో వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.
దాఖలు చేసిన చెరుకు సుధాకర్ పిటిషన్
జిల్లా కోర్టు చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు
నల్లగొండ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకో వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. వెంకట్‌రెడ్డిపై హత్యానేరం నమో దు చేయాలని సుధాకర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ కొనసాగింది. కొద్ది రోజుల క్రితం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెరుకు సుధాకర్ కుమారుడు చెరుకు సుహాస్‌కు ఫోన్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుమార్లు ఎస్పీతో పాటు వన్‌టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నందున వెంకట్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు జిల్లా సెషన్ కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.