Share News

యాసంగికి సిద్ధం

ABN , First Publish Date - 2023-12-09T00:20:41+05:30 IST

యాసంగి సాగుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతటా వరికోతలు పూర్తయి, ధాన్యం కొనుగోళ్లు కూడా ముగిసే దశలో ఉన్నాయి. పలుచోట్ల ధాన్యం సేకరణ పూర్తికావడంతో వెంటనే యాసంగి పంటలపై రైతులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఈ సారి ముందస్తుగానే పంటల సాగుపై కార్యాచరణను వ్యవసాయశాఖ సిద్ధంచేసింది.

యాసంగికి సిద్ధం

పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక

మండలాలవారీగా అంచనాలు రూపొందించిన వ్యవసాయ శాఖ

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): యాసంగి సాగుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతటా వరికోతలు పూర్తయి, ధాన్యం కొనుగోళ్లు కూడా ముగిసే దశలో ఉన్నాయి. పలుచోట్ల ధాన్యం సేకరణ పూర్తికావడంతో వెంటనే యాసంగి పంటలపై రైతులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఈ సారి ముందస్తుగానే పంటల సాగుపై కార్యాచరణను వ్యవసాయశాఖ సిద్ధంచేసింది.

జిల్లాలో మూసీ నీటితోపాటు వ్యవసాయ బోరుబావులపై ఆధారపడి పంటలను సాగు చేస్తారు. 17 మండలాల్లోనూ వరి అధికస్థాయి లో సాగుచేయగా, వరితో పాటు పలు రకాల పంటలను సాగు చేస్తారు. యాసంగిలో జిల్లాలో మొత్తం 2,61,150 ఎకరాల్లో పలు పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా రూపొందించింది. ఈ మేరకు మండలాలవారీగా ఏయే పంటలు సాగు చేస్తే బాగుంటుందనే అంశాన్ని అధికారులు పరిశీలించారు. సాగునీటి ప్రాజెక్టుల కింద సాగు లేకపోవడంతో ఆరుతడి పంటలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జిల్లాలో 2,40,500 ఎకరా ల్లో వరిని, మిల్లెట్స్‌ 150 ఎకరాలు, పప్పులు 150 ఎకరా లు, నూనె ఆధారిత పంటలు 250 ఎకరాలు, మరో 20, 100 ఎకరాల్లో మొక్కజొన్న, పెసర, మినుములు, ఉలవ లు, ఇతర పంటలను సాగు చేసేందుకు అంచనాలను సిద్ధంచేసింది. గత వానాకాలంలో మొత్తం 4.46 లక్షల ఎకరాల్లో పలు పంటలను సాగు చేయగా, వీటి లో వరి 3లక్షల ఎకరాల్లో, పత్తి 1.11లక్షల ఎకరాల్లో, కంది, నూనెగింజలు, ఇతర పంటలు దాదాపు 9వేల ఎకరాల విస్తీర్ణంలో సాగుచేశారు.గత యా సంగితో పోలిస్తే ఈసారి పంట ల సాగు తగ్గింది. గత ఏడాది యాసంగిలో 3,10,165 ఎకరాల్లో పంటలను సాగుచేశా రు. యాసంగిలో పంటల సాగుకోసం మూసీ పరివాహ క ప్రాంతాల్లో వరి కోతలు పూర్తయి, యాసంగి పంట కు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పొలాల దుక్కులు దున్నడం ప్రారంభించారు. ఈ మేరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు.

90శాతం మేర వరిసాగు

యాసంగిలో 90శాతం వరి సాగుపైనే వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. గతంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై విస్తృతంగా ప్రచారం చేపట్టింది. అయితే గత యాసంగి నుంచి ప్రత్యామ్నాయ పంటల ఊసెత్తలేదు. జిల్లాలో 2,40,500 ఎకరాల్లో వరిని సాగుచేసేందుకు ప్రణాళికను రూపొందించింది. గతంలో వరి పంటకు బదులు మినుము, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, వేరుశనగ, శనగలు మొదలైన ఆరుతడి పంటలు సాగు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ సూచించింది. అయితే జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో బోరుబావుల్లో నీటి లభ్యతను బట్టి రైతులు పలు పంటలను పండిస్తారు. ఈ నేపథ్యంలో వరికి ప్రాధాన్యమిచ్చింది.

యాసంగిలో 2.61లక్షల ఎకరాల్లో సాగుకు అంచనాలు : అనురాఽధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2.61లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసేందుకు అంచనాలు రూపొందించాం. మరోవారం రోజుల్లోగా జిల్లాలో యాసంగి ప్రారంభంకానుంది. ఈ మేరకు మండలాల వారీగా ఏయే పంటలు సాగుచేసే అవకాశం ఉందన్న వివరాలు సేకరించాం. ఇందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాసంగిలో వరి ధాన్యం అధికశాతం జిల్లాలోని రైతులు సాగుచేస్తారు. గ్రామాల్లో పర్యటించి, రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2023-12-09T00:20:42+05:30 IST