న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఒత్తిడి తెస్తా
ABN , First Publish Date - 2023-04-13T00:40:20+05:30 IST
న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు అన్నారు.
హుజూర్‌నగర్, ఏప్రిల్ 12: న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పట్టణంలోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి ఆధ్వర్యంలో పల్లె నాగేశ్వరరావుసునీత దంపతులకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నానన్నారు. చెప్పులు లేకుండా తిరిగిన ప్రతి గల్లీ తనకు గుర్తుందన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఎస్సీ హాస్టల్‌లో ఉండేవాడినన్నారు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగానని, కష్టమంటే ఏమిటో తెలిసినవాడినన్నారు. న్యాయవాదుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. న్యాయవాదులు తనకు ఎంతో సహకారం అందించినందునే బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించానన్నారు. న్యాయవాదుల అభ్యున్నతికి కృషిచేస్తానన్నారు. అనంతరం పట్టణంలో న్యాయవాదులు భారీ ఊరేగింపు నిర్వహించి పల్లె నాగేశ్వరరావును గజమాలలు, శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా టీయూడబ్ల్యూజే-ఐజేయూ, మాలమహానాడు, లారీ అసోసియేషన్ ఆఽధ్వర్యంలో పల్లె నాగేశ్వరరావు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన జక్కుల నాగేశ్వరరావు, న్యాయవాదులు కాలువ శ్రీనివాస్‌నాయుడు, రవికుమార్, కృష్ణయ్య, ప్రదీప్తి, క్రాంతికుమార్, శంకర్, సురేష్, శ్రీను, చంద్రయ్య, అంజయ్య, రమణారెడ్డి, వీరయ్య, నగేష్, బాలాజీనాయక్, గోపాలకృష్ణమూర్తి, శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణ, నాగేశ్వరరావు, చావా సహదేవరావు, కిరణ్మయి, మాధవరెడ్డి, బెంజిమెన్, ఇట్టిమళ్ల శ్రీను, బాబూరావు, శాంత, జీవా పాల్గొన్నారు.